Header Banner

షారుక్ ఖాన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్! ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్..

  Tue May 06, 2025 13:12        Entertainment

ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మెట్ గాలా వేడుక న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో అట్టహాసంగా జరిగింది. ఏటా మే మొదటి సోమవారం జరిగే ఈ ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరవుతారు. ఈ ఏడాది కూడా పలువురు భారతీయ తారలు ఈ వేదికపై మెరిశారు. అయితే, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తొలిసారి ఈ వేడుకలో పాల్గొనడం విశేషం కాగా, ఆయన లుక్‌పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మెట్ గాలాలో షారుక్ ఖాన్‌తో పాటు కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, దిల్జిత్ దోసాంజ్, నటాషా పూనావాలా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వంటి ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

ప్రతి ఒక్కరూ తమదైన విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, షారుక్ ఖాన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించిన పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించి, లేయర్డ్ నెక్లెస్‌లు, చేతిలో వాకింగ్ స్టిక్, కళ్లకు గాగుల్స్‌తో కనిపించారు. షారుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, షారుక్ ఖాన్ లుక్‌పై ఆయన అభిమానుల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. షారుక్ మేనేజర్ పూజా దదలానీ ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇంత పెద్ద అంతర్జాతీయ వేడుకకు సంబంధించిన ఫొటోలను షారుక్ స్వయంగా పంచుకోకుండా, మేనేజర్ ద్వారా షేర్ చేయడాన్ని కొందరు అభిమానులు తప్పుబడుతున్నారు. అంతేకాకుండా, షారుక్ లుక్ తమకు నచ్చలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. "సబ్యసాచి, మీరు ఆయన లుక్‌ను పూర్తిగా పాడుచేశారు" అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, "ఈ లుక్ చూడటానికే నేను 3:30 వరకు మేల్కొని ఉన్నాను (కానీ నిరాశపరిచింది)" అని మరో యూజర్ పేర్కొన్నారు. మొత్తంగా, బాద్‌షా తొలి మెట్ గాలా ఎంట్రీ కొంతమంది అభిమానులను నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem